8 April, 2026 | 3:35 AM

కుల వ్యవస్థలో బాధితులు దళితులే

08-04-2026 01:51 AM

దళిత క్రైస్తవుల కోసం ఉద్యమం చేస్తాం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదన్న 1950లో వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలని పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కులవ్యవస్థలో బాధితులుగా మిగిలింది కేవలం దళితులు మాత్ర మేనని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవ మత ప్రచారాన్ని తీసుకువచ్చింది అగ్రకుల బ్రా హ్మణులేనని తెలిపారు. దళితులందరూ ఉమ్మడిగా కలిసి పేద దళిత క్రైస్తవుల అస్తిత్వం కాపాడుకుందామని పిలుపునిచ్చారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కి రాష్ట్రపతి ఆర్డ ర్ పూర్తిగా విరుద్ధమన్నారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. కుల వ్యవస్థ రద్దు చేయాలని, ఆర్టికల్ 14, 15 కూడా వ్యతిరేకమని స్పష్టం చేశారు. కులం, జాతి బేధం లేకుండా అందరూ సమానమని రాజ్యాంగం చాలా చక్కగా వివరిం చిందన్నారు. రాజ్యాంగంలోని ప్రధాన మార్గదర్శకాల ప్రకారం మన వ్యవస్థ ముం దుకు వెళ్లుతోందన్నారు. భారతదేశంలో సనాతన ధర్మం మాత్రమే ఉండాలనుకుంటే చట్టాలను తీసివేసి మీ విశ్వాసం ప్రకారం ఉంచాలన్నారు. దళితుల పట్ల వివక్షత, చిన్నచూపు ఉందని రాష్ట్రపతి ఆర్డర్ చెబుతున్నదని తెలిపారు.

బీసీ కేటగిరిలలో ఏ గ్రూప్‌లో మెహతాలు, బీ గ్రూపులో దూదేకులు, ఈ గ్రూపులో 14 ముస్లిమ్ వర్గాలు ఉన్నాయని, ఈడబ్ల్యూసీ కేటగిరిలో 311 కులాలు ఉన్నాయని, వీరిలో మహమ్మద్‌లు, ముస్లిం షేక్, ముస్లిమ్ సయ్యద్, పకీర్లు, పఠాన్‌లు, సాహెబ్‌లు, సున్నీ ముస్లిమ్‌లు కూడా ఉన్నారని, వీళ్లు ఏ మతంలో ఉన్నా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి కేటగిరిలో కులాలకు లేని వివక్ష దళితులకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఈ దేశంలో ఆర్టికల్ 341 మేరకు ఎస్సీలను, 342 ప్రకారం ఎస్టీలను గుర్తించిందని, ఏపీలో ఎస్టీలు 6 శాతం, ఈశాన్య రాష్ట్రాల్లో 100 శాతం రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. 

కుల వ్యవస్థ వల్లే మతమార్పిడి..

దేశంలో కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది కొంత మంది బ్రాహ్మణులేనని కృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ దేశానికి వచ్చిన ముస్లిం రాజులను, క్రైస్తవ సంస్థలను ప్రభావితం చేసింది కూడా  బ్రాహ్మణులే అన్నా రు. దేవుళ్ళను శాసిస్తారని, దేవుళ్లే వాళ్ళ కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నారని చెబుతుంటే, ఇంకా దళితులు, బీసీలను లెక్క చేస్తారా? అని ఆవేదన వ్యక్తంచేశారు. కులమతాల వల్ల భారతదేశం వైశాల్యం తగ్గుతూ వచ్చిందని, మతమార్పిడి జరిగిందన్నారు. ఆ లోపాలను సరిచేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ పాస్ట ర్‌లు అందరూ అగ్రకులం వారేనని, కార్లు, విమానాల్లో తిరిగి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని అన్నారు. సైకిల్‌పై వెళ్ళే దళిత పాస్టర్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దళిత క్రైస్తవుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. దళిత క్రైస్తవుల అంశాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళతానని, ఇది వారి ఆత్మగౌరవ సమస్యగా అభివర్ణించారు. అం తర్గతంగా ఎన్ని విబేధాలున్నా, దళితుల స్వే చ్ఛను కాపాడుకోవాలని, భిన్నాభిప్రాయాలు తగ్గించుకొని ప్రతిఒక్కరూ కలిసి ముందుకు సాగాలని మందకృష్ణ మాదిగ కోరారు.