03-06-2025 12:20:36 AM
-అతని పేరు చెప్తే మావోయిస్టులకు వణుకు
-మావోయిస్టు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ లక్ష్మణ్ కేవత్
చర్ల ,జూన్ 2 (విజయక్రాంతి):ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోని బీజాపూర్ జిల్లా కాంకేర్ పరిధి లో గల పఖంజోర్ పోలీస్ స్టేష న్ ఇన్చార్జ్ గా పనిచేస్తున్న జవా న్ లక్ష్మణ్ కేవత్ విలక్షణమైన శై లి గురించి చాలా చర్చనీయాంశమౌతుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా పిలువబడే లక్ష్మణ్ కేవత్ పేరు వింటేనే మావోయిస్టులు వణికిపోతారు.
ఈ జవాన్ ఇప్పటివరకు 83 మంది మావోయిస్టులను హత మార్చాడు. దీని తరువాత, కెవాట్ తన బైక్ మీద ’83 ప్లస్ టు నోటు’ అని రాసుకోవడం గమనార్హం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుండటం సైనికులు ఇప్పటివరకు చాలా మంది మావోయిస్టులను హతమార్చారు. కాగా, చాలామంది లొంగిపోయి ప్రధాన స్రవంతిలో చేరారు.
ఇటీవల బస్తర్ జిల్లాలోని కర్రెగుట్ట కొండలో ప్రారంభించిన ఆపరేషన్ కాగర్ లో(బ్లాక్ ఫారెస్ట్లో) సైనికులు గొప్ప విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే, ఐతే తను ఒక్కడే చేసిన 83 ఎన్కౌంటర్ల సంఖ్య తో తన బ్పై 83+ అని రాసుకున్న ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.ఎండ్