28 June, 2026 | 10:34 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

03-06-2025 12:20 AM

కృష్ణ, జున్ 2: మండలంలోని ఆలంపల్లి గ్రామంలో సోమవారం లబ్ధిదారులకు మంజూరై న నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని అందులో భాగంగానే నేడు వికలాంగుడైన నిరు పేదైన శివప్పకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడం జరిగిందన్నారు.

అ నంతరం టైరోడ్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంబంధిత అధి కారులు తదితరులు పాల్గొన్నారు.