6 June, 2026 | 6:16 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

మెకానిక్.. ఆదెరువు బైక్..

11-04-2026 12:40 AM

తుంగతుర్తి, ఏప్రిల్ 10: లక్షల రూపాయలు పెట్టుబడి లేకుండా, తెలివి, శ్రమతో ఓ వ్యక్తి ఇంటింటికి బైక్ పై తిరుగుతూ మెకానిక్ పనిచేస్తూ ఉపాధి రంగంలో రాణిస్తున్నారు. మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో శాలిగౌరారం మండలానికి చెందిన ఎర్ర నరసయ్య అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా గ్యాస్ స్టవ్, మిక్సీ, సీలింగ్ ఫ్యాన్ వంటి పరికరాల మరమ్మతులు చేయడం ప్రారంభించాడు. ఒకే చోట పని దొరకక, ఇబ్బందులు గురవుతున్న తరుణంలో ఏకంగా టూ వీలర్ కి వెనుక ప్రత్యేకంగా వస్తువులు వేసేందుకు ఓ తొట్టి తయారు చేయించాడు.

దానిలో మరమ్మత్తులు చేసే సామాగ్రితో సహా ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేసుకొని, ప్రతి రోజు రెండు, మూడు గ్రామాల మొత్తం కలియ తిరుగుతూ మరమ్మత్తులు చేస్తున్నాడు. తక్కు వ ధరకే గ్యాస్ స్టవ్, మిక్సీ ఫాన్స్ రిపేర్ చేస్తూ, కొత్త పరికరాలను వేస్తూ ప్రతిరోజు రూ.1500- 2000 సంపాదిస్తున్నట్లు ఆనందంతో తెలిపాడు. ఎవరో వచ్చి ఏదో చేస్తా రని ఎదురుచూడకుండా మనకు వచ్చిన పనినే వినూత్న పద్ధతిలో చూపాడు ఈ రం గంలోనైనా రాణించ వచ్చు అంటున్నాడు నరసయ్య. ప్రభుత్వం స్పందించి ఆర్థిక వనరులు కల్పిస్తే మరో నలుగురికి మెకానిక్ నేర్పి, జీవితంలో స్థిరపడేటట్లు చేస్తానని విజయక్రాంతికి వివరించాడు.