11 April, 2026 | 2:36 AM

ప్రమాదాల నివారణకు గేదెల కొమ్ములకు రేడియం స్టిక్కర్స్

11-04-2026 12:42 AM

కోదాడ ఏప్రిల్ 10, పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు గేదెల కొమ్ములకు రేడియం స్టిక్టర్స్ వేస్తున్నట్లు మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానికులతో కలిసి మునగాల మండల కేంద్రంలో గేదల కొమ్ములకు రెడ్ రేడియం స్టికర్స్ అంటించడం జరిగినది. ఆయన మాట్లాడుతూ పశువుల వల్ల రాత్రిళ్ళు అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి పశువులు, ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని వీటి నివారణకోసం చర్యలు తీసుకోవాలా జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల ప్రకారం ముందుకు వెళుతున్నాం అన్నారు. రైతులు వారి పశువులకు రేడియం స్టిక్కర్లు వేయించుకోవాలని రాత్రివేళ పశువులని వదలకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి రాములమ్మ, ఎస్త్స్ర ప్రవీణ్ కుమార్, అధికారులు, పాల్గొన్నారు.