14 March, 2026 | 3:33 AM

గిట్టనివారితో కుమ్మక్కై ఇబ్బందులకు గురి చేస్తున్నాడు

14-03-2026 02:05 AM

అలంపూర్, మార్చి 13: ఎమ్మార్పీఎస్ నాయకులు జయరాజు మాకు గిట్టని కాం గ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకునితో కుమ్మక్కై మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పుల్లూరు గ్రామానికి చెందిన నా గార్జున, మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు. మా యొక్క పొలముల విషయంలో అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నట్లు వా పోయారు. ఈ క్రమంలో అలంపూర్ చౌర స్తా లో ఉన్న జయరాజును అడిగేందుకు వెళ్ల గా... మాపై దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. మా కు అండగా ఉన్న గజేందర్ రెడ్డి, శ్రీనివాసులకు గొడవకు ఎలాంటి సంబంధం లేకపో యినా తప్పుడు కేతులు పెట్టే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అధికారులు దీనిపై విచారణ చేసి ఆయన నుంచి మాకు విముక్తి కల్పించండి అంటూ విన్నవించారు.