బ్లాక్‌లో సిలిండర్‌కు డిమాండ్
బుకింగ్‌కు 45 రోజుల గ్యాప్ ఉండాలంట
జిల్లా వ్యాప్తంగా 3,47,000 గ్యాస్ కనెక్షన్లు
25 గ్యాస్ ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు సరఫరా
అర్జెంట్‌గా కావాలంటే ఒక్క సిలిండర్‌కు రూ.2 వేలు
సరఫరాకు సరైన చర్యలు తీసుకుంటున్నాం : గంప శ్రీనివాస్, డీఎస్‌ఓ, మహబూబ్ నగర్
మహబూబ్ నగర్, మార్చి 13 (విజయక్రాంతి): ఉన్నట్టుండి గ్యాస్ సరఫరా లో నూతన నిబంధనలు అమల్లోకి రావడంతో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు దూ రం అవుతున్నాయి. కనీసం ఒక్కసారి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల్లో వినియోగదారుడికి చేరుతున్నప్పటికీ మరో సిలిండర్ కావాలంటే కనీ సం 45 రోజులు వేచి చూడాల్సిందే. ఒక సి లిండర్ బుక్ చేసుకుంటే ఆ కుటుంబానికి ఆ సిలిండర్ 45 రోజులు ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు.
ఒక్కరు ఇద్దరు ఉంటే తప్ప నలుగురు నుంచి ఐదు మంది ఉన్న కుటుంబ సభ్యులకు ఒక సిలిండర్ 45 రోజులు మాత్రం సరిపోదని వినియోగదారులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఓటిపి కూడా తప్పనిసరి చేస్తూ నిబంధనలను సవరించారు. కొందరు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు బ్లాక్ దందాకు తెర లేపారు. మీకు అర్జెంటుగా సిలిండర్ కావాలంటే తొమ్మిది వందల పైచిలుకు ఉన్న సిలిండర్ దాదాపుగా రూ 1600 నుంచి రూ 2000 వరకు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.
- చెప్పడం ఒకటి... చేసేది ఒకటి
సివిల్ సప్లై అధికారులు నియమ నిబంధన ప్రకారం సిలిండర్లను సరఫరా చేపిస్తు న్నామని చెబుతున్నప్పటికీ ఆ నిబంధనలు చాలావరకు అమలుకు దూరంగా ఉన్నాయి. శుక్రవారం జడ్చర్ల లోని శ్రీ వెంకటేశ్వర ఇం డియన్ గ్యాస్ మధ్యాహ్నం 12 గంటలైనా కూడా ఆఫీసు తెరవకపోవడంతో వినియోగదారులు సిలిండర్లను పట్టుకొని కార్యాలయం ముందు గంటల తరబడి నిరీక్షణ చేశారు.
ఈ విషయంపై ఈ ఏజెన్సీ ని ర్వాహకులకు గ్యాస్ ఏజెన్సీ ఎందుకు బందుకు ఉంది అని తెలుసుకునేందుకు ఫోన్ ద్వా రా ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ నిబంధనలు ప్రజలకు అర్థం కాక తీవ్ర ఇ బ్బందులకు గురి అవుతుండ్రు. అవగాహన కల్పించాల్సిన అధికారులు సైతం కార్యాలయాలకు పరిమితం కావడంతో ప్రజలకు పూర్తిస్థాయి సమాచారం అందడం లేదని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధిక ధరకు గ్యాస్ కంపెనీలు విక్ర యించితున్నప్పటికీ చేసేదేమీ లేక అత్యధిక ధరకు కొనుగోలు చేస్తున్నామని వినియోగదారులు చెబుతున్న మాట. ఒక సిలిండర్ 45 రోజులు సరిపోతుందా? కట్టెల వైపు చూస్తున్న గ్రామీణ ప్రజలు ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత 45 రోజుల పాటు మరో సిలిండర్ బుక్ చేసుకున్నందుకు నిబంధనలు ఉండడంతో ఒక్క సిలిండర్ 45 రోజులు ఒక కుటుంబానికి ఎలా సరిపోతుందని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు.
ఇక చేసేదేమీ లేక మెల్లగా కట్టెల వైపు చూడక తప్పడం లేదంటూ గ్రామీణ ప్రజలు ఇప్పటికే అటువైపు ఆలోచన చేస్తుండ్రు.అధికారులు పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు చేయించడంతో పాటు ప్రాధాన్యత ప్రకారం సిలిండర్లు సరఫరా జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినియోగదారులు పేర్కొంటారు. జిల్లా వ్యాప్తంగా 347000 గ్యాస్ కనెక్షన్లు ఉండగా వినియోగదారులకు 25 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి.
- సరఫరాను పరిశీలిస్తున్నాం..
వినియోధరకులకు పూర్తిస్థాయిలో గ్యాస్ సిలిండర్లు సరఫరా అయ్యే విషయాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తు న్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా జరుగుతుంది. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
గంప శ్రీనివాస్, డిఎస్‌ఓ మహబూబ్ నగర్




