23 June, 2026 | 7:33 PM

Breaking News

ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •  

కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ రైలు ప్రారంభం

14-03-2026 02:06 AM

అస్సాంలో ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాం తి): అస్సాం, తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్ర ధాని నరేంద్ర మోదీ శుక్రవారం అస్సాంలో ప్రారంభించారు. అస్సాంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ రైలు సేవలను అందిస్తుంది.

ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు ఏపీలోని శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దు వ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరులో ఆగుతుండగా, తెలంగాణలో నల్లగొండలో ఆగనున్నది.