calender_icon.png 26 September, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిహారం కోసం తల్లిని హతమార్చాడు

21-09-2025 12:00:00 AM

-మద్యం మత్తులో కొడుకు ఘాతుకం

-రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

చేవెళ్ల , సెప్టెంబర్ 20(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిని హతమార్చా డు ఓ తనయుడు. ఈ అమానవీయ ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. చేవెళ్ల మండల పరిధి రేగడిఘనాపూర్ గ్రామానికి చెందిన గొంగుపల్లి నర్సమ్మ (70), భర్త (లేట్) అనంతయ్యల కుమారుడు జంగయ్య (43) చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి దవాఖానలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

   ఇటీవల గొంగుపల్లి నర్సమ్మకు సంబంధించిన వ్యవసాయ పొలం లోంచి హైటెన్షన్ విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం తరపున రూ.రెండు లక్షల పరిహారం వచ్చింది. శనివారం మధ్యా హ్నం జంగయ్య మద్యం సేవించి ఆ పరిహారానికి సంబంధించిన డబ్బు ఇవ్వాలని తల్లిని వేధించాడు. అందుకు ఆమె నిరాకరించడం తో ఇంట్లోని కొడవలితో నరికి హత్య చేశాడు. తర్వాత ఏమి తెలియనట్టుగా తన తల్లి మరణించిందని చుట్టు పక్కల వాళ్లను నమ్మించ డానికి ప్రయత్నించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.