21-09-2025 12:00:00 AM
-భూవివాదం నేపథ్యంలో హత్య చేసిన వైనం
-హంతకుడు మృతుడివద్ద డ్రైవర్
-హతుడు కూడ పలు కేసుల్లో నిందితుడు
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేముల వాడ అర్బన్ మండలం నంది కమాన్ సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమే ష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన గత 20 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వేములవాడ గాంధీనగర్‌కు చెం దిన ఎద్దండి వెంకటేష్ ఈ హత్య చేసినట్లు సమాచారం. హంతకుడు మృతుడి వద్ద డ్రైవర్ గా పనిచేస్తూ వీరి మధ్య ఒక ఫ్లాట్ కు సంబంధించిన భూ వివాదం వల్ల ఈ హత్య జరిగిందని, నిందితుడు వేములవాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.
కాగా రమేష్ ను కారు లోనే గొంతు కోసి చంపాడు. ఈ హత్య జిల్లాలోనే సంచలనం రేపింది. మృతుడు సిరిగిరి రమేష్ పై పీడీ యాక్ట్ నమోదైంది. పలు కేసుల విషయంలో జైలు పాలయ్యాడు. తన భర్తను వేములవాడకు చెందిన ఎద్దండి వెంకటేష్ హత్య చేసినట్లు రమేష్ భార్య అనిలా వేములవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అలాగే వేంకటేష్‌తో పాటు సిరిగిరి మురళి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రాము, పాస్టర్ వేణు, కుంటయ్య, గంగయ్య మరి కొంతమందిపై అనుమానం ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు.