06-02-2026 01:53:35 AM
నిర్మల్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నిర్మల్‌లో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు కావాలని రైతులకు రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పి రైతులను మరోసారి మోసం చేసే కుట్ర పన్నుతున్నారన్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించవలసిన ఐదు విడుదల రైతు భరోసా నిధుల్లో మూడు విడుదల రైతు భరోసా విధులు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలు ఏమయ్యాయిని ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ప్రజలు నిలదీస్తుంటే వాటిపై ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడడం లేదన్నారు. రైతులను ప్రజలను ఆటో కార్మికులను అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.