14 May, 2026 | 3:27 AM

మొండెం లేని శిశువు తల లభ్యం

14-05-2026 02:20 AM
  1. పీక్కుతున్న కుక్కలు 
  2. పాల్వంచలో హృదయ విదారక సంఘటన 

భద్రాద్రి కొత్తగూడెం, మే 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త గూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ వల్లూరు గూడెంలో బుధవారం హృదయ విధారక సంఘటన చోటు చేసుకుంది. బొల్లోరిగూడెం ప్రాంతంలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ భవనం సమీపంలో బుధవారం మొండెం లేని శిశువు తల లభ్యమైంది. ఆ తలను వీధి కుక్కలు పీక్కుతినడాన్ని స్థానికులు గమనించారు.  సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచా రణ చేపట్టారు.  పసికందు అవశేషం ఏ ప్రాంతానికి ఎలా చేరిందని, ఎవరైనా ఈ ప్రాంతం లో వదిలి వేశారా అనే కోణాల నుంచి పోలీసులు విచారణ చేపట్టారు.