28 August, 2026 | 7:55 AM

మల్లారెడ్డి పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం

27-08-2026 09:37 PM

వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపన గండ్ల మండలంలోని బొల్లారం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో కామ్రేడ్‌ సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు కామ్రేడ్‌ కృష్ణయ్య మాట్లాడుతూ రైతుల సమస్యలు, హక్కుల కోసం మల్లారెడ్డి నిరంతరం పోరాటం చేశారని, ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ మధు సతీమణి కామ్రేడ్‌ సుమతి మృతికి నాయకులు సంతాపం తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం ఆమె చేసిన కృషిని కొనియాడుతూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల నాయకులు వి. కృష్ణయ్య, వై. నాగరాజు, వి. తిరుపతయ్యతో పాటు పార్టీ కార్యకర్తలు, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.