16 March, 2026 | 4:15 AM

పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, సన్మానం

16-03-2026 12:00 AM

అశ్వాపురం, మార్చి 15 (విజయక్రాంతి): ప్రజాపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం రామచంద్రాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భూరెడ్డి స్వాతి వెంకటరెడ్డి అధ్యక్షతన పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే వారికి శానిటరీ కిట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రంగా ఉండి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం బాగుండాలని, అందుకే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో ముఖ్యమని కొనియాడారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి గ్రామ ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొడియం మల్లేష్, వార్డు సభ్యులు పగడాల సరిత, పగడాల అశోక్ రెడ్డి, మాసిరెడ్డి వెంకటరెడ్డి, పగడాల విజయ్, కొమ్ము భద్రయ్య, సూర్య, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, డీఏఓలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.