28 August, 2026 | 10:50 AM

విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

28-08-2026 01:05 AM

రాజాపూర్: పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులకు ఛాయిస్ ఫౌండేషన్ కొండాపూర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ మేఘన, 18 మంది సభ్యుల వైద్య బృందం చే  ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్య శిబిరంలో ఆరో తరగతి నుంచి పదో విద్యార్థులందరికీ కంటి చెవి ముక్కు అన్నవాహిక, సాధారణ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు.అవసరమైన విద్యార్థులకు హాస్పిటల్కు సిఫార్సు చేశారు.పరీక్షల అనంతరం విద్యార్థులకు ఉచితంగా ఔషధాలను పంపిణీ చేశారు.అనంతరం విద్యార్థులు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.