మున్సిపల్ కార్మికుల వేతనాలు తగ్గించడం సిగ్గుచేటు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో మహాధర్నా
ముషీరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాల్సిందిపోయి ఉన్న వేతనాలను తగ్గించడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజి ంచిన నేపథ్యంలో మల్కాజ్గిరి, సైబరాబాద్ కా ర్పొరేషన్లలో తక్కువ వేతనాలు చెల్లించడం అన్యాయమన్నారు. రెండో పీఆర్సీని అమలు చేసి జీహెచ్‌ఎంసీలో చెల్లిస్తున్న వేతనాలను మున్సిపల్ కార్మికులకూ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయడంతో పాటు నెలకు కనీసం రూ.26 వే ల వేతనం చెల్లించాలని కోరారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాల రాజ్ మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, ఉ ద్యోగ భద్రత కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్లు, వితంతు, వృద్ధాప్య పెన్షన్ వంటి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని కోరారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్రెడ్డి మాట్లాడుతూ కంప్యూటర్ ఆ పరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, డ్రైవర్లు, వాటర్ సప్లై, శానిటరీ సిబ్బంది, ఇన్స్పెక్టర్లు, ఎన్‌ఎంఆర్ కార్మికుల వేతనాలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు ఏసురత్నం అధ్యక్షత వ హి ంచగా వెంకటేశం, వెంకటయ్య, కిషన్, యా దగిరి, ఉస్మాన్, మద్దిలేటి, కమలమ్మ, శ్రీనివాస్, అజయ్, సతీష్, ఆనంద్, మహేందర్, తిరుపతి, అశోక్, కిరణ్, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






