25 April, 2026 | 3:40 AM

ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి అసలైన సంపద

25-04-2026 12:58 AM
  1. జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన
  2. జిల్లాలో ఘనంగా పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం

భద్రాద కొత్తగూడెం, ఏప్రిల్ 24, (విజయక్రాంతి): ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి అసహైన సంపదని, మనం తీసుకునే ప్రతి ముద్ద మన ఆరోగ్యానికి పెట్టుబడి కావాలని అదనపు కలెక్టర్ విద్యా చందన అన్నారు.  శుక్రవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ న మీటింగ్ హాల్లో జిల్లా మహిళ, శిశు,దివ్యాంగుల ,వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి జె.స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమము నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే, అక్షరభ్యాసం  అన్నప్రసనా, గర్భిణీలకు శ్రీమంతాలు, జిల్లా స్థాయిలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అత్యున్నత ప్రతిభ కనబరిచిన జిల్లా స్థాయి సిడిపివోలకు, సూపర్వైజర్లకు, పోషణ అభియాన్ సిబ్బందికి, అంగనవాడి టీచర్లకు మేమేంటో,ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతులైనా పౌరులే దేశానికి అసలైన సంపద అని మనం తీసుకునే ప్రతి ముద్ద మన ఆరోగ్యానికి పెట్టుబడి కావాలన్నారు.

ఈ పోషణ పక్వాడా స్ఫూర్తిని ఈ 15 రోజులే కాకుండా, ఏడాది పొడవునా కొనసాగించే విధంగా మహిళా శిశు,సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందించి అంగన్వాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని కోరారు. ఈ  కార్యక్రమంలో జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీలత, వైద్య విద్య శాఖ అధికారులు సతీష్, డాక్టర్ రాకేష్, జిల్లాలోని సిడిపివోలు, సూపర్వైజర్లు, అంగనవాడి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.