18 April, 2026 | 3:56 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ

23-06-2025 01:41 PM

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సీజే ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయిస్తే, ఆ భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళిక సిద్ధిం చేసి జేసీబీలతో భూములను చదును చేసింది. టీజీఐఐసీకి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ కోరుతూ పిటిషనర్లు హైకోర్టులో వేర్వేరుగా నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు  చేశారు.

ఇదిలా ఉండగా, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం సమోటో విచారణకు స్వీకరించింది. కొట్టేసిన చెట్లలో మళ్లీ మొక్కలు నాటాలని సుప్రీ ఆదేశాలు టీజీఐఐసీకి జారీ చేసింది. మొక్కలు నాటకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు బాధ్యులై అధికారులను జైలులో పెడతామని కోర్టు హెచరించింది.