calender_icon.png 31 July, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షటిల్ ఆడుతుండగా గుండెపోటు

29-07-2025 02:41:14 AM

  1.   25 ఏండ్ల యువకుడి మృతి 
  2. ఉప్పల్‌లోని అకాడమీలో ఘటన

ఎల్బీనగర్, జూలై 28: షటిల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద యం జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేశ్(25) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉప్పల్ బాగాయత్ ఎలైట్ గేమర్ గ్యారేజ్, విక్రాంత్ బ్యా ట్మెంటన్ అకాడమీలో సోమవారం ఉదయం షటిల్ ఆడు తుండగా రాకేశ్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన తోటివారు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.