29-07-2025 02:41:46 AM
ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు ఖరారుపై సమీక్ష
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కళాశాలల్లో ట్యూషన్ ఫీజుల ఖరారు కోసం ఇటీవల నియమించిన అధికారులు ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో భేటీ కానుంది. మొత్తం తొమ్మిది మందితో ఈ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర కోర్సులకు టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించిన ఫీజుల అంశాన్ని ఈ కమిటీ పునఃసమీక్ష చేయనున్నది. 2025 (బ్లాక్ పీరియడ్) మూడేళ్లకు సంబంధించిన ఫీజులను నిర్ధారించి ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఫీజులను ఖరారు చేయనుంది.
ప్రస్తుతం పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ కొత్త ఫీజులు అమల్లోకి వస్తే ఆ మేరకు విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే తాజాగా ఏర్పాటైన కమిటీ తొలిసారిగా సమావేశమై ఫీజుల అంశంపై చర్చించనుంది.