ఇవేం ఎండలు?
05-05-2024 12:05 AM
రాష్ట్రంలోని ఇరవై రెండు జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీలకు చేరుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ శాఖ అధికారులు నల్గొండ, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, జోగులాంబ గద్వాల్, నిర్మల్, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. ఉదయం 8 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. రాష్ట్రంలోని 95 ప్రాంతాల్లో వడగాలులు వీచినట్లు కూడా సమాచారం వచ్చింది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలి.
దివ్యశ్రీ, నిజామాబాద్






