12 May, 2026 | 6:09 PM

తగ్గిన సర్వీసుల వాణిజ్యం

04-05-2024 12:05 AM

ఎగుమతులు 30 బిలియన్ డాలర్లు

దిగుమతులు 16.61 బిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ, మే 3: దేశం నుంచి జరిగిన సర్వీసుల ఎగుమతుల్లో క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో సర్వీసుల ఎగుమతులు 1.3 శాతం తగ్గి 30 బిలియన్ డాలర్లకు చేరినట్టు రిజర్వ్‌బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సర్వీసుల దిగుమతులు 2.1 శాతం క్షీణించి 16.61 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం రెండు నెలల్లోనూ సర్వీసుల ఎగుమతులు, దిగుమతులు రెండూ వృద్ధిచెందాయి. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి సేవల ఎగుమతులు రూ.339.62 కోట్లకు చేరినట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. దిగుమతులు 177.56 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు ఆ డేటా వెల్లడిస్తున్నది. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్య మిగులు 162 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని అంచనా. సర్వీసులు, వస్తూత్పత్తుల ఎగుమతులు రెండూ కలుపుకుంటే 2023 776.68 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చని వాణిజ్య శాఖ తెలిపింది. 2022 ఇవి 776.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.