17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

30-05-2025 11:44 AM

 నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) మే నెలలోనే భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఎగువన కురుస్తున్న ముందస్తు భారీ వర్షాల నేపథ్యంలో జూరాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమై జూరాల ప్రాజెక్టు(Jura Project) ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం 38.9150 టిఎంసి నీరు నిల్వ ఉండగా సుంకేశుల నుంచి 8,824 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు నుంచి 97,659 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. దీంతో శుక్రవారం ఉదయం 818.20 అడుగుల వద్దకు చేరి 38.9150 టిఎంసి నీరు నిల్వకు చేరింది. ఈ అధిక ప్రవాహాన్ని గమనించిన అధికారులు అప్రమత్తమయ్యారు.