4 July, 2026 | 9:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

దంచికొట్టిన వ‌ర్షం..

26-04-2025 08:53 PM

గ‌డ్డ‌పోతారంలో ఒరిగిన‌ విద్యుత్ స్తంభం

లీఫార్మా ప‌రిశ్ర‌మ నుంచి వ్యాపించిన ఫీమ్స్‌

ప‌టాన్ చెరు: జిన్నారం మండ‌లంలో శ‌నివారం సాయంత్రం వ‌ర్షం దంచికొట్టింది. గ‌డ్డ‌పోతారం పంచాయ‌తీలో భారీ వ‌ర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కురిసిన వ‌ర్షానికి గ‌డ్డ‌పోతారంలో విద్యుత్ స్తంభం ఒరిగింది. పారిశ్రామిక వాడ‌లోని లీఫార్మా ప‌రిశ్ర‌మ నుంచి ఫీమ్స్ భారీగా వ్యాపించాయి. దీంతో స్థానికంగా ఉన్న నివాసం ఉంటున్న కార్మికులు, ప్ర‌జ‌లు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందులుప‌డ్డారు. మ‌రో వైపు వ‌ర్షాన్నిఆస‌రాగా చేసుకొని ప‌లు ప‌రిశ్ర‌మ‌లు ర‌సాయ‌న వ్య‌ర్థాల‌ను వ‌ద‌ల‌డంతో వ‌ర్షం వ‌ర‌ద‌లో క‌లిసిన ర‌సాయ‌నాలు సమీపంలోని చెరువు, కుంట‌ల్లోకి చేరాయి. పీసీబీ అధికారులు స‌మ‌స్య‌ను ప‌ట్టించుకొని ప‌రిశ్ర‌మ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక ప్ర‌జ‌లు కోరారు.