3 August, 2026 | 7:06 AM

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

24-08-2024 12:29 AM

నాలుగు రోజులు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): కర్ణాటకలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని శుక్రవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో భారీ వానలు పడుతాయని, సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అం చానా వేసింది. ఈ మేరకు నాలుగు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిం ది. ఈ నాలుగు రోజులు వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఈదురు గాలులు గం టకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొన్నది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.