3 August, 2026 | 8:02 AM

30, 31న డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు వైవా పరీక్షలు

24-08-2024 12:28 AM

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు పదోన్నతులు పొందేందుకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్ష తేదీలను విడుదల చేశారు. ఈమేరకు వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను పొందుపర్చారు. వీరికి ఈ నెల 30, 31 తేదీల్లో వైవా పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. స్పెష ల్ లాంగ్వేజీ తెలుగు టెస్ట్ ఆఫ్ ఆఫీస ర్స్ కోసం వైవా పరీక్షలు నిర్వహించనున్నారు. ఏఎంవీఐ పోస్టుకు స్పోర్ట్స్ కోటాలో ఒక అభ్యర్థి అర్హత సాధించినట్టు మరొక ప్రకటనను విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఈ నెల 28న, వైద్యపరీక్షలకు ఈ నెల 29న హాజరుకావాలని తెలిపింది. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది.