7 July, 2026 | 7:59 PM

Breaking News

ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి   •   రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన   •   రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన   •   మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం   •   జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •  

భారీగా రేషన్ బియ్యం పట్టివేత..

19-10-2024 11:56 AM

ఖమ్మం (విజయక్రాంతి): కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామం వద్ద అక్రమంగా తరలించడానికి సిద్దంగా ఉన్న 150 క్వింటాల రేషన్ బియ్యం లోడ్ లారీని అత్యంత విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న లారీని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే విధంగా నేలకొండపల్లి మండలంలో బొలెరో వాహనంలో తరలిస్తున్న మరో 30 క్వింటాల బియ్యాన్ని పట్టుకోవడంతో రెండు మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న 180 క్వింటలా భారీ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకోవడంతో అక్రమ దందా దారులకు గుబులు పుట్టిస్తోంది. గత కొంత కాలంగా గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై కొందరు వ్యక్తులు ఇంటి ఇంటికి తిరిగి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు కోదాడకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.