calender_icon.png 5 November, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హలో దళిత చలో ఢిల్లీ

05-11-2025 04:25:20 PM

హన్మకొండ (విజయక్రాంతి): భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని బొక్కల వెంకటస్వామి మాదిగ అన్నారు. నవంబర్ 20న జరగబోయే హలో దళిత చలో ఢిల్లీ మహాధర్నను జయప్రదం చేయుట కొరకై బుధవారం రాష్ట్ర అధ్యక్షులు బొక్కల వెంకటస్వామి మాదిగ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గవాయిపై జరిగిన దాడిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇట్టి విషయంపై ఒక  ట్విట్వర్ ద్వారానే స్పందించారు కానీ, విచారణ జరపలేదు కావున రాజ్యాంగ విలువలను కాపాడాలని మహాధర్నకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు ఆశీర్వాదం మాదిగ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ ఎడ్ల ఉపేంద్ర మాదిగ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎడ్ల సమ్మయ్య మాదిగ, వరంగల్ జిల్లా అధ్యక్షులు దాసరపు సారన్న మాదిగ, జనగాం జిల్లా అధ్యక్షులు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు మైపాల్ మాదిగ, భూపాల్ మాదిగ, సీనియర్ నాయకులు సింగారపు చిరంజీవి మాదిగ, పెండ్యాల స్వరాజ్ గీసుకొండ మండల అధ్యక్షులు తక్కలపల్లి రాజశేఖర్ మాదిగ, కమలాపూర్ మండల అధ్యక్షులు కుమ్మరి నాగేశ్వరరావు మాదిగ,  కొమురయ్య, అంబాల ఆనందం, పెండ్యాల శిరీష, కోట శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.