05-11-2025 04:26:49 PM
రెబ్బెన (విజయక్రాంతి): కార్తీక పూర్ణిమ సందర్భంగా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానంలో అమ్మవారికి, కాల భైరవ స్వామికి, అరుణాచల శివుడికి, శనీశ్వర స్వామికి భూగర్భంలో ఉన్న మహంకాళీ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేపట్టారు. ఉసిరి దీపాలతో హారతి ఇచ్చారు. నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.