05-11-2025 04:21:30 PM
అమీన్ పూర్: అమీన్ పూర్ బీరంగూడెం గుట్ట శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. బుధవారం ఉదయం నుంచే ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక పౌర్ణమిని అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారని చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా, ఆలయార్చకులు తెలిపారు. భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ శివనామ స్మరణతో ఆలయాం మారుమోగింది.