12-11-2025 12:46:41 AM
వేములపల్లి నవంబర్ 11, (విజయక్రాంతి): రోడ్డు దాటుతుండగా వృద్ధుడుని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలై వృద్ధుడు మృతి చెందిన సంఘటన వేములపల్లి మండలంలో శెట్టిపాలెం క్రాస్ రోడ్ వద్ద మంగళవారం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాడుగుల పల్లి మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన అక్కినపల్లి బజారాయ్య (70) అద్దంకి నార్కెట్పల్లి రోడ్డు దాటుతుండగా నల్గొండ నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది.
దీంతో వృద్ధునికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.