24 February, 2026 | 11:17 PM

హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నియమం కాదు... కుటుంబ భద్రత కవచం

24-02-2026 07:20 PM

సబ్ ఇన్స్పెక్టర్ సూర్య

ఉప్పల్,(విజయక్రాంతి): హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నియమం కాదు కుటుంబ భద్రత కవచమని  మల్కాజ్గిరి జోన్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ సూర్య అన్నారు. మంగళవారం రోజున  హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా వేయకుండా వారి వివరాలు నమోదు చేసి హెల్మెట్ ను కొనిపించి  వాహనదారులకు హెల్మెట్ ను ధరించాలని సూచించారు.

ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ సూర్య మాట్లాడుతూ... జరిమానాలు వసూలు చేయడమే కాదు ప్రజల పాణాలు కాపాడమే అసలు ఉద్దేశం అని హెల్మెట్ అన్నది కేవలం ట్రాఫిక్ నియమం కాదని కుటుంబ భద్రత కవచమని ఆయన పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు.