24 February, 2026 | 9:31 PM

మౌలిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

24-02-2026 07:25 PM

వాంకిడి(విజయక్రాంతి): విద్యార్థులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం క్రమం తప్పకుండా అందించడంతో పాటు గ్రామంలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని బంబార గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజీ తెలిపారు. మంగళవారం వాంకిడి మండలం బంబార గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి, విద్యార్థుల కోసం తయారు చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు, గర్భిణులకు పోషకాహారం నిబంధనల ప్రకారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గ్రామంలో వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ ప్రజల సౌకర్యార్థం అవసరమైన అన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శి, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.