కొత్త జంటకు హెల్మెట్ల పంపిణీ
01-05-2026 08:33 PM
మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం జరిగిన వివహా వేడుకలకు అల్లాపూర్ గ్రామ సర్పంచ్ అంకెన్ పల్లి నారాయణ హాజరై తన సొంత డబ్బులతో నూతన వధూవరులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని ఉద్దేశంతో తన వంతుగా హెల్మెట్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. వాహనదారులందరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి సురక్షితంగా బయట పడొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.






