22 April, 2026 | 10:29 AM

పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుండాలి

01-04-2025 12:00 AM

ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ 

ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన పద్మశాలి జిల్లా నూతన కమిటీ

మహబూబాబాద్ ,మార్చి 31: (విజయ క్రాంతి): పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని, చేనేత కార్మికుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు.సోమవారం మరిపెడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యేను నూతనంగా ఎన్నికైన పద్మశాలి జిల్లా నూతన కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద ర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలీలు రాజకీయాలతోపాటు అన్ని రంగాల్లో అభి వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.రాష్ట్ర సాధనలో పద్మశాలి పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎంతో కీలకమని తెలంగాణా తొలి,మలి తెలంగాణా పోరాటానికి ఆయన మార్గదర్శకంగా నిలిచారన్నారు.

రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పద్మశాలీల ఉన్నతి కోసం పాటుపడుతోందని,అందులో భాగంగానే డ్వాక్రా మహిళలకు చీరెల తయారీ కోసం సుమారు రూ.600 కోట్ల ఆర్డర్ సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వటం జరిగిందన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిలక మారి వెంకటేశ్వర్లు,గౌరవ అధ్యక్షులు అను మాండ్ల వెంకటేశ్వర్లు,జిల్లా ప్రధాన కార్యదర్శి సామల నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కారంపూడి ఉపేందర్,జిల్లా కోశాధికారి బొమ్మ వెంకన్న,మహబూబాబాద్ పట్టణ అధ్యక్షులు ములక కృష్ణమూర్తి,కార్యవర్గ సభ్యులు మామిడాల వెంకన్న,దేవరశెట్టి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.