12 July, 2026 | 5:37 PM

Breaking News

పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •   జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం   •  

స్కిల్ వర్సిటీకి చేయూత

17-06-2025 12:31 AM

- కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

- యువతలో ప్రతిభను వెలికితీయడమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయం 

- నైపుణ్యాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం

- బషీర్‌బాగ్ పీజీ కాలేజీలో మెగా స్కిల్, లోన్ మేళా ప్రారంభోత్సవం

హైదరాబాద్, జూన్ 16 (విజయ క్రాంతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేసిన స్కిల్ వర్సిటీకి సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం కేంద్రం నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌద రికి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ బషీర్‌బాగ్ పీజీ కాలేజీలో సోమవారం ఆయన కేంద్ర మంత్రితో కలిసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనిం గ్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్/స్కిల్ అండ్ లోన్ మేళాను ప్రారంభించి మాట్లాడారు. యువతలో ప్రతిభను వెలికితీసి, నైపుణ్యాలు అభివృద్ధి చేసి.. వారికి ఉపాధి, ఉద్యోగ అవకా శాలు కల్పించడమే తెలంంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

యువశక్తే రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ఆస్తి అని, కానీ చాలా మందిలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు ఉండటం లేదన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య ఎంతో అంత రం నెలకొన్నదని, దాన్ని భర్తీ చేసే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముం దుకు సాగుతున్నదని పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాలు మెరుగుపరిచే ప్రక్రియలో పరిశ్రమల యాజమాన్యాలు, నిపుణులను భాగస్వాములను చేస్తున్నామని స్పష్టం చేశారు.

శిక్షణ తీసుకున్న యువతలో 80 శాతం మందికి ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. యువత టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఓటమికి నిరుత్సాహం చెందకుండా ప్రయత్నం చేస్తూ నే  ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ, ఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్  పాల్గొన్నారు.