calender_icon.png 17 July, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న సన్నిధి అభివృద్ధికి శ్రీకారం

17-06-2025 12:31:10 AM

వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

రాజన్న సిరిసిల్ల: జూన్ 16 (విజయక్రాంతి) వేములవాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాత్రికేయుల సమావేశం.ప్రభుత్వ విప్ మాట్లాడుతూ. రాజన్న సన్నిధి అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది.ఆదివారం నుండి పట్ట ణంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయి.. 80 ఫీట్స్ రోడ్డు వెడల్పు పనులుకొనసాగుతున్నాయి.

నవంబర్ 20న ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి నాయకత్వంలో 8 మంత్రుల సమక్షంలో 76 కోట్లతో ఆలయ విస్తరణ,47 కోట్లతో రోడ్డు వెడల్పు కోసం, 35 కోట్లతో అన్న సత్ర నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు, 25-26 బడ్జెట్లో వంద కోట్లు రాజన్న ఆలయ, పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది.

ఆలయ అభివృద్ధి,పట్టణ అభివ్రుద్ది సమాంతరంగా చేస్తున్నాం.పెరుగుతున్న పట్టణ జనాభా కు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని చేస్తాం. ముప్పు సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్న రోడ్డు వెడల్పు, ఆలయ అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతున్నాం..