17 May, 2026 | 7:43 PM

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి

20-06-2024 01:08 AM

కేంద్రమంత్రులతో మంత్రి పొన్నం భేటీ

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రానికి పెదఎత్తున నిధులు ఇచ్చి అండగా నిలబడాలని కేంద్ర మంత్రులను రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యర్థించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జయంత్ సింగ్ చౌదరితో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికే చెందిన కిషన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నిధుల విడుదల కోసం కృషి చేయాలని పొన్నం కోరారు. ఇక 15వ లోక్‌సభలో తనతో పాటు సహచర ఎంపీగా ఉన్న జయంత్ సింగ్ చౌదరి ఇప్పుడు కేంద్ర మంత్రిగా బాధ్యత లు తీసుకున్నందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగా రాష్ట్రంలోని యువత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు.