17 May, 2026 | 6:31 PM

కేంద్ర మంత్రులతో కిషన్ రెడ్డి భేటీ

20-06-2024 01:09 AM

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం తన సహచర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినందుకు వారికి అభినందనలు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో టీబీజేపీ చీఫ్ నియామకంపై చర్చ జరిగినట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదలకు సహకరించాలని కిషన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రి జితేంద్ర సింగ్‌తో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించినట్లుగా ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.