24 April, 2026 | 1:52 AM

మృతుని కుటుంబానికి హెల్పింగ్ హాండ్స్ ఆర్థిక సహాయం

24-04-2026 12:00 AM

రేవెల్లి ఏప్రిల్ 23: మండల కేంద్రంలోని తల్పునూర్ గ్రామానికి చెందిన తప్పెట చిన్న సాయిలు (90), అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మరణించారు. విషయం తెలుసుకు న్న తల్పునూర్ గ్రామ హెల్పింగ్ హాండ్స్ కమిటీ సభ్యులు మృతుని కుటుంబానికి రూ 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జి. కురుమయ్య, కోశాధికారి కె. రాజు, ప్రచార కార్యదర్శి కె. కిరణ్, హెల్పింగ్ హాండ్స్ కమిటీ సభ్యులు టి. శేఖర్, జి. ఎల్ల స్వామి, కల్మూరి కురుమయ్య, పి. రాములు, టి. దేవరాజు, టి. బాల పీరు, టి. ఆంజనేయులు, టి. యాదయ్య, టి. భగవంతు, వి. బాలకృష్ణయ్య, కే. మధు, టి. కురుమయ్య, పి. రామచంద్రయ్య, గోపాల్ పేట బాలరాజ్ పాల్గొన్నారు.