తెలంగాణ పాలిట వరప్రదాయిని కాళేశ్వరం
ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ కాళేశ్వరంపై ఆరోపణలు...
ప్రజా పాలన కాదు ... ప్రతీకార పాలన.
వనపర్తి, ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన పి.సి.ఘోష్ కమిషన్ నివేదిక నిబంధనలకు విరుద్ధంగా ఉందని కమిషన్ సిఫార్సుల మేరకు కె.సి.ఆర్,హరీష్ రావు పై చర్యలు తీసుకోకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని మాజీ మంత్రి నివాస గృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
రెండున్నర ఏండ్ల నుండి కాలయాపన తప్పా అభివృద్ధి పథకాలు అమలు చేసింది లేదని కేవలం కె.సి.ఆర్ మీద ఆరోపణలు చేయడానికి పాలన సాగించినట్లు ఉందని వారు ఘా టుగా విమర్శించారు. గోదావరి జలాలు ఆంధ్రాకు తరలించడం కోసం రేవంత్ గురువు చంద్రబాబు నాయుడుకు లబ్ది చేయడానికి మేడిగడ్డ రిపేర్ చేయడం లేదని ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నరన్నారు.
ఇప్పటికైనా కక్ష్య సాధింపు చర్యలు మానుకొని ఇచ్చిన420, హామీలు ,ఆరు గ్యారంటీలు కోసం కృషి చేయాలని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో నందిమల్ల అశోక్, పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్, స్టార్. రహీమ్, సయ్య ద్. జమీల్, సూర్యవంశం గిరి, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.






