06-07-2024 02:30:00 AM
సందర్భం ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చే మాజాయే వేరు కదా! అదే పిల్లలైతే మరీ థ్రిల్లింగా ఫీల్ అవుతారు. గిఫ్ట్ వచ్చిదంటే చాలు.. దాన్ని ఎప్పుడెప్పుడూ ఒపెన్ చేయాలా అని వెయ్యి కళ్లతో దాని వైపే చూస్తుంటారు. గిఫ్ట్ చిన్నదా? పెద్దదా? అనే దానితో సంబంధం లేదు. గిఫ్ట్ అనేది ప్రేమపూర్వకమైన సంభాషణ. పిల్లల్ని ఒకరితో ఒకరిని కమ్యూనికేట్ చేసేందుకు ప్రోత్సహిస్తుంది. గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిన తరువాత ఏ వయసు వారికి? ఎలాంటి గిఫ్ట్? ఇవ్వాలి అనేదాని గురించి ఆలోచన మొదలవుతుంది. కళ్లముందు ఉండే రకరకాల గిఫ్ట్స్ నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకొని ఇవ్వాలనుకుంటారు! అలా కాకుండా వయసుల వారీగా చిన్నారులకు గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. అవి చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి. గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఏ వయసు వారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో..చూసేయండి!
2-5 సంవత్సరాలు
ఈ దశను శిశువు ఎదుగుల, అభివృద్ధి దశగా పరిగణిస్తారు నిపుణులు. రెండు నుంచి ఐదేండ్ల చిన్నారుల చర్మం సున్నితంగా, మృదువుగా ఉంటుంది. కాబట్టి వారి చుట్టూ ఎలాంటి హాని కలిగించే వస్తువులను ఉంచకూడదు. మరీ ముఖ్యంగా ఈ వయసులో వినోదాన్ని, విజ్ఞానాన్ని కలిగించే ఆట బొమ్మలను బహుమతిగా ఇవ్వాలి. ఇది చిన్నారుల ప్రారంభ దశ కాబట్టి ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. చిన్నారుల దృష్టిని ఆకర్షించే విధంగా రంగురంగుల బొమ్మలను అర్థవంతమైన గిఫ్ట్స్‌ను ఇవ్వడం మూలంగా చిన్నారుల ఐక్యూ లెవల్స్ బాగా పెరుగుతాయి.
గిఫ్ట్స్‌ః బిల్డింగ్ బ్లాక్స్, పజిల్స్, అబాకస్, పండ్లు బొమ్మలు, జంతువుల బొమ్మలు.
6-12 సంవత్సరాలు
నిజానికి ఆరు నుంచి పన్నెండేళ్ల వయసు వచ్చే సరికి చాలా గిఫ్ట్స్‌ని చూసే ఉంటారు పిల్లలు. ఈ వయసు వారికి ఇష్టమైన కార్టూన్ షోల నుంచి బొమ్మలను, డ్రెస్‌లను బహుమతిగా ఇవ్వొచ్చు. ఈ వయసులో ముఖ్యంగా పిల్లలు కార్టూన్ షోలను చూడటం ద్వారా వ్యక్తిగత అభిరుచులను ఏర్పరుచుకుంటారు. వాళ్లు చూసే కార్టూన్స్ పట్ల ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. కాబట్టి పిల్లలకు ఈజీగా కనెక్ట్ అయ్యే వాటిని గిఫ్ట్‌గా ఇవ్వాలి. కార్టూన్స్ గిఫ్ట్స్ ఇవ్వడం మాత్రమే కాదు.. వాటి వల్ల కలిగే లాభమేంటి? నష్టమేంటో? చిన్నారులకు వివరించాలి. అప్పుడే పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు.
గిఫ్ట్స్‌ః వారికి అవసరమైన స్టేషనరీ, బొమ్మలు, కలరింగ్ పుస్తకాలు, కథల పుస్తకాలు, ఫెవరేట్ డ్రెస్.
12-16 సంవత్సరాలు
ఈ దశను టీనేజ్‌కి వెళ్లే ప్రారంభ దశగా చెప్పుకుంటారు. ఈ వయసు పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వడం కొంచెం కష్టంగా అనిపించొచ్చు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఈ తరం పిల్లలకు కాలానికి అనుగుణంగా కాస్త భిన్నంగా ఆలోచించే విధంగా బహుమతులు ఉండాలి. చిన్నారులు ఒకటి నుంచి పన్నెండేళ్ల వయసు వరకు వారికి అవసరమైన పుస్తకాలు, బట్టలు, స్టేషనరీ, గేమ్స్, బోర్డ్ గేమ్స్ వంటివి సెలక్ట్ చేసుకుంటారు. ఇక పన్నెండేళ్ల నుంచి వారికి ఇష్టమైన గేమ్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌కు సంబంధించిన వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఈ వయసులో గిఫ్ట్సే ఇవ్వాలని రూలేం లేదు. సరదాగా పిల్లలను సినిమాలకు, పార్క్‌లకు, గేమ్స్, టూర్స్‌కు తీసుకెళ్లొచ్చు.
18-25 సంవత్సరాలు
ఇది చాలా ముఖ్యమైన దశ. పిల్లలు టీనేజ్‌లోకి అడుగు పెట్టే దశగా గుర్తించాలి. ఈ వయసు పిల్లలకు వారికి అవసరమైన బట్టలు, పుస్తకాలు, స్టేషనరీలు గిఫ్ట్స్‌గా ఇవ్వొచ్చు. ఇక వారి ఆసక్తి, ఇష్టాన్ని బట్టి సంగీత వాయిద్యాలను, డ్రాయింగ్ వర్క్‌షాప్స్, డ్యాన్స్ క్లాస్‌లకు, యానిమేటెడ్ సినిమాలను చూపించడం వంటివి చేయవొచ్చు. ఇవి పిల్లల క్రియేటివిటీని పెంచుతాయి.
25-30 సంవత్సరాలు
ఈ వయసులో స్వీయ ఆలోచనలు, సొం త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా లైఫ్‌లో స్థిరపడాలి.. అనుకున్నది సాధించాలనే ఆలోచనలతో కొందరుంటే.. మరి కొందరు ఆల్రెడీ డైలీ లైఫ్‌లో స్థిరపడి ఉంటారు. కాబట్టి పిల్లల ఆలోచన విధానాన్ని బట్టి వారికి అవసరమైన వాటిని బహుమతిగా ఇవ్వాలి. ఈ వయసు వారికి కాఫీ హ్యాంపర్లు, స్నాక్స్, మేకప్, సెల్ఫ్ కేర్, పెర్ఫ్యూమ్ వంటివి గిఫ్ట్స్‌గా ఇవ్వాలి.
గిఫ్ట్స్ వల్ల కలిగే లాభాలు!