10 July, 2026 | 2:42 AM

హీరో మోటో నికరలాభం 18 శాతం వృద్ధి

09-05-2024 12:09 AM
  1. న్యూఢిల్లీ, మే 8: ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటో కార్ప్ 2024 మార్చితో ముగిసిన క్యూ4లో రూ. 1,016 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇప్పటివరకూ ఏ త్రైమాసికంలోనూ లేనంత గరిష్ఠస్థాయిలో లాభాన్ని చూపించింది. గత ఏడాది ఇదేకాలంలో నమోదైన రూ.859 కోట్లతో పోHero Motocorp net profitలిస్తే లాభం 18 శాతం పెరిగింది. కంపెనీ నికరలాభం దాదాపు మార్కెట్ అంచనాలకు దగ్గరగా ఉన్నది. తాజా త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 14.6 శాతం పెరిగి రూ. 8,306 కోట్ల నుంచి రూ. 9,519 కోట్లకు చేరింది. షేరుకు రూ. 40 చొప్పున తుది డివిడెండును హీరో మోటో బోర్డు సిఫార్సుచేసింది. 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఇబిటా 25 శాతం వృద్ధిచెంది రూ.1,359 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికరలాభం 36 శాతం పెరిగి రూ.3,968 కోట్లకు చేరగా, కార్యకలాపాల ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 37,456 కోట్లకు పెరిగింది. 

13.92 లక్షల వాహన విక్రయాలు

తాజాగా ముగిసిన త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ 13.92 లక్షల యూనిట్ల మోటారు సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. గత ఏడాది క్యూ4లో 12.40 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో తమ విక్రయాలు 56.21 లక్షల యూనిట్లకు చేరినట్టు కంపెనీ వెల్లడించింది. 2022 ఇవి 53.29 లక్షల యూనిట్లు. ప్రీమియం, 125 సీసీ విభాగాల్లో తాము తీసుకొచ్చిన మోడల్స్‌తో మార్కెట్ వాటాను పెంచుకున్నామని హీరో మోటో సీఈవో నిరంజన్ గుప్తా చెప్పారు. జూమ్ 125సీసీ, జూమ్ 160 సీసీలను విడుదల చేసి స్కూటర్ పోర్ట్‌ఫోలియోను పటిష్టపర్చుకున్నామన్నారు.