16 July, 2026 | 12:38 AM

ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం

16-07-2026 12:00 AM

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన చిత్రం ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కే నిహారిక దాసరి నిర్మించారు. ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రుత్విక్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

“యాక్టింగ్ బయట నుంచి చూసినప్పుడు ఒకలా కనిపిస్తుంది. కానీ పరిశ్రమలోకి వచ్చాక అది ఎంత కష్టమైన ప్రయాణమో తెలుస్తుంది. ఆ కష్టాలు మాటల్లో చెప్పలేం.. అనుభవిస్తేనే అర్థమవుతాయి. నాకు ఎప్పు డూ ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం. తొలి సినిమాలోని రెండు గెటప్స్ కోసం పూర్తిగా ప్రిపేర్ అయ్యాను. కాస్ట్యూమ్స్ కూడా స్వయంగా చూసుకున్నా. -మా నాన్నకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. న్యూయార్క్‌లో నా పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా ఆనందపడ్డారు.

అప్పటి నుంచి నాకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్లమని ప్రోత్సహించారు. ఒక షార్ట్ ఫిల్మ్‌కి మంచి ప్రశంసలు రావడంతో మా కుటుంబానికి కూడా నాపై మరింత నమ్మకం వచ్చింది. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ సినిమా. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు చిరునవ్వుతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. కొత్తగా -కొన్ని కథలు వింటున్నా. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం” అని చెప్పారు.