ప్రేమతో చేసిన చిత్రం ఓ సుకుమారి
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ.! సుకుమారి’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్‌రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. “ఇది ప్రేమతో, కష్టపడి చేసిన సినిమా.
ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని అన్నారు. ‘మా సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంద’ని హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చెప్పారు. “ఈ సినిమాపై నాకు డబుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరిస్తుంది. వినోదానికి ఎలాంటి లోటు ఉండదు” అని దర్శకుడు భరత్ దర్శన్ తెలిపారు. ‘మేము చాలా మంచి సినిమా తీశామ’ని నిర్మాత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీధర్‌గౌడ్, డీవోపీ కుషేందర్, సంగీత దర్శకుడు భరత్, ఎడిటర్ శ్రీ ప్రసాద్, మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.






