11 March, 2026 | 7:37 PM

ఒకరికొరకు అండగా నిలవాలి

09-03-2026 12:00 AM
  1. కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో మహిళాదినోత్సం
  2. హాజరైన హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి

హైదారాబాద్, మార్చి 8 (విజయక్రాంతి) : మహిళలు ఒకరికొరకు అండగా ఉన్నప్పుడే మార్పు సాధ్యమవుతుందని హైకోర్డ్ న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి అన్నారు. అంతర్జా తీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో గివ్ టు గెయిన్ అంశంపై ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చే శారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా ఆమె హాజరై మాట్లాడారు. స్త్రీలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో పురుషుల తో సమానంగా దూసుకపోతున్నారని అన్నా రు. ఇక్కడ ఎంతో మంది మహిళా వైద్యులు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు.

ప్రతి ఒక్క మహిళా న్యాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలని సూచించారు. సినీ రచయిత్రి, సీరియల్ స్క్రిప్ట్ రైటర్ గౌలాని చాల్ల గుల్ల, ది పనాష్ కమ్యూనిటీ వ్యవస్థాపకురాలు శ్వేత అడోలియా, సెకండ్ ఛాన్స్ ఫౌం డేషన్ వ్యవస్థాపకురాలు, సామాజిక కార్యకర్త జెరిసా జాస్పర్ పాల్, కిమ్స్ హాస్పిటల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. మనిమాల రావు, ప్రసూతి. గైనకాలజీ నిపుణురాలు డా. ఎం. మాధవి, అలాగే కిమ్స్ హాస్పిటల్ జీఎం నర్సింగ్ హరీత విజయన్ పాల్గొన్నారు. ఈ చర్చకు చైల్డ్ న్యూట్రిషనిస్ట్, లాక్టేషన్ ప్రొఫెషనల్ పూజా మరాఠే మోడరేటర్‌దీగా వ్యవ హరించారు. మహిళల కోసం ప్రత్యేక సర్‌ప్రైజ్‌లు కూడా ఏర్పాటు చేశారు.