calender_icon.png 15 November, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైబిజ్ వన్ కార్తీక మహోత్సవం

15-11-2025 12:00:00 AM

  1. నేటి నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహణ
  2. ఒకే వేదికపై హోమాలు,అభిషేకాలు, పారాయణాలు
  3. భక్తులకు ప్రవేశం ఉచితం

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): మరో అత్యద్భుత ఆధ్మాత్మిక సమ్మే ళనానికి భాగ్యనగరం వేదికైంది. హైబిన్ వన్ ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. హోమాలు, వ్రతాలు, అభిషేకాలు, పారాయణాలు.. ఇలాంటి సకల కార్యక్రమాలను ఒకేచోట నిర్వహించడం నిజంగా గొప్ప అనుభూతి. హైబిజ్ వన్ తొలిసారిగా ఈ బృహత్ కార్యా న్ని చేపట్టింది.

హైదరాబాద్ అమీర్ పేట ధరమ్ కరణ్ రోడ్‌లోని ఎంసీహెచ్ గ్రౌండ్ లో శుక్రవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నా యి. ఇంకో విశేషం ఏంటంటే.. ఆయా క్రతువుల్లో పాల్గొనే భక్తులు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ భక్తులు పూర్తి ఉచితంగా వాటికి హాజరుకావచ్చు అన్నారు.హైబిజ్ వన్ కార్తీక మహో త్సవానికి సంబంధించిన వివరాలను నిర్వాహకులు మీడియా సమావేశం ద్వారా వెల్ల డించారు. కార్తీక మహోత్సవం గొప్ప కార్యక్రమమని.

ఇన్ని రకాల పూజలు, హోమాలు, వ్రతాలు, పారయణాలు ఒకే వేదికపై నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది భగవత్ సంకల్పమని తెలిపారు. మొద టి రోజున కార్యక్రమాలు ఘనంగా జరిగాయని, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నార న్నారు. రెండో రోజు శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు రుద్రాభిషేకం,రుద్ర హోమం, కీసరగుట్ట దేవస్థానం వారి ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం, పూజా కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటాయన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు అడికె కార్తీక్ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా, శ్రీనగర్ కాలనీ అయ్యప్ప దేవస్థానం పూజారి శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ, అనంతరం అల్పాహార వితరణ ఉం టాయన్నారు.

 అలాగే కార్యక్రమాల ముగిం పు రోజు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం, అనంతరం అన్న ప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గౌడ్ గురూజీ వారి ఆధ్వర్యంలో కార్తీక పురాణ విశిష్టత ప్రవచనం, అనంతరం ప్రసాద వితరణ ఉంటా యన్నారు. వివరాలకు 8340974747 నంబర్‌లో సం ప్రదించాల్సిందిగా నిర్వాహకులు కోరారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతిరెడ్డి ముఖ్యఅతిథిగా, హైబిజ్ వన్ ఫౌండర్ అండ్ ఎండీ డాక్టర్ జె. సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.