15-11-2025 12:00:00 AM
మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 14(విజయక్రాంతి): అత్యద్భుత ఆధ్యాత్మిక సమ్మేళ నానికి భాగ్యనగరం వేదికైంది. హైబిజ్ వన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్తీక మహోత్సవ వేడుకలు అమీర్‌పేట ధరమ్ కరణ్ రోడ్‌లోని ఎంసీహెచ్ గ్రౌండ్‌లో శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు హోమాలు, వ్రతా లు, అభిషేకాలు, పారాయణాలు మొదలైన పూజా కార్యక్రమాలను ఒకేచోట జరగనున్నాయి. మొదటి రోజు గణపతి హోమంతో మొదలై ఆపై వేదాద్రి అర్చకుల ఆధ్వర్యంలో మహా చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచం మొత్తం టెక్నాలజీలో వేగంగా ముందుకు సాగుతోందని.. మనం చాలా అభివృద్ధి సాధిస్తున్నాం..ఎన్నో ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అయితే మన మూలాలైన మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన సనాతన ధర్మం వంటి వాటిని ఎప్పటికీ మర్చిపోవద్దు అని అన్నారు. ధర్మాలను అనుసరించాలి.. హోమాలు, పూజలు తప్పకుండా చేయాలి‘ అని చెప్పారు.