calender_icon.png 23 August, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి చలో బస్ భవన్‌కు హైకోర్టు అనుమతి

05-12-2024 02:15:08 AM

హైదరాబాద్, డిసెంబర్ ౪ (విజయక్రాంతి): ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి హైకోర్టు అనుమతినిచ్చింది. మొదట ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసులు అంగీకరించారని, అనుమతి ఇస్తామని చెప్తూ వచ్చి హఠాత్తుగా ఈ నెల 3న రాత్రి 8 గంటలకు అనుమతి ఇవ్వడం లేద ని తెలిపారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈ దురు వెంకన్న తెలిపారు.

గత్యంతరం లేక ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లి అనుమతులు పొందినట్టు వివరించారు. బస్ భవన్ వద్ద నిరసనతో కూడిన మాస్ మీటింగ్‌కు అను మతిని ఇచ్చినట్టు తెలిపారు. చలోబస్ భవన్‌కు కార్మికులందరూ ఎలాంటి భయాలు లేకుండా రావాలని కోరా రు.

గురువారం సర్కారు ఏర్పాటు చేసిన రవాణాశాఖ విజయోత్సవాలను బహిష్కరించి చలో బస్‌భవన్‌కు హాజరై ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షను ప్రజలకు, ప్రభుత్వానికి తెలిసేలా చేద్దామని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రావాలని ఆయన విజ్ఞప్తిచేశారు.