calender_icon.png 23 August, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

125 కోట్లతో గోదావరిపై హై లెవెల్ బ్రిడ్జి

05-12-2024 02:15:07 AM

* పెద్దపల్లికి రూ. 82 కోట్లతో బైపాస్ రోడ్డు   

* పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్సు డిపో 

* మంథనిలో 162 కోట్లతో రింగ్ రోడ్డు 

* ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపెల్లి డిసెంబర్ 4 (విజయక్రాంతి): మంథని పట్టణంలో వ్యాపార వాణిజ్యం పెరిగే దిశగా మంథని- మధ్య రూ. 125 కోట్లతో  గోదావరి నది పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్సు డిపో తీసుకొచ్చా మని తెలిపారు. పెద్దపల్లి యువ వికాస సభ లో మంత్రి శ్రీధర్ బాబు  మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్సు డిపో కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని, పెద్దపల్లి పట్టణ వాసుల కోరిక మేరకు రూ. 82 కోట్లతో బైపాస్ రోడ్డును మంజూరు చేస్తున్నామని, ఇందులో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు కీలక పాత్ర పోషించారని మంత్రి తెలిపారు. అలాగే రూ. 79 కోట్లతో పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల మంజూరు చేసినట్లు చెప్పారు.

సింగరేణి సంస్థ ద్వారా రూ. 23 కోట్లతో రామగుండంలో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. రూ. 51 కోట్ల తో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిని 100 పడకలకు అప్ గ్రేడ్ చేస్తున్నామని, 26 కోట్లతో నర్సింగ్ కళాశాల పనులకు శంకుస్థాపన చేశామని మ్రంతి వెల్లడించారు. గ్రామీ ణ ప్రాంతాల్లో  రోడ్లు, డ్రైయిన్లు,  కమ్యూనిటీ హాళ్లను నిర్మించామన్నారు. సంవత్సర కాలంలో రికార్డ్ స్థాయిలో 55 వేల 143 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి కల్పన కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ శ్రీ పాద్ మార్గ్ నుంచి  మంథ ని పట్టణానికి రూ. 162 కోట్లతో నాలుగు లేన్ల రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రూ. 2  కోట్ల 45 లక్షలతో గుంజప డుగులో నూతన పీహెచ్‌సీ, రూ. 22 కోట్లతో మంథనిలో నూతనంగా 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రూ. 7 కోట్లతో రామగిరి ఖిల్లా, మంథని టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధికి మూడు నదులు కలిసే కాళేశ్వరం దేవాలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారీ చేశామని ఆయన వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాలలో వాటా అందించామని, సింగరేణి ఉద్యోగులకు సంబంధించి ఇండ్ల స్కీం, పన్నుల విధానంపై కార్యాచరణ అమలు చేశామని చెప్పారు.

చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్‌కు సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిన సీఎం రేవంత్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రామగుండంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుతో వ్యాపారాల అభివృద్ధికి అవకాశం ఉందని ఆయన అన్నారు. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో పాలకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని, పోతారం ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని  శ్రీధర్ బాబు పేర్కొన్నారు.